తెలంగాణలోని మీలవోలు నుంచి పాల వ్యానులో అక్రమంగా.. మద్యం రవాణా చేస్తుండగా.. కృష్ణా జిల్లా కంచికచర్లలో పోలీసులు పట్టుకున్నారు.
పాలవ్యానులో విడిగా కంటైనర్ ఏర్పాటు చేశారు. వాటినుంచి మొత్తం 342 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు.