ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు'

వైకాపాకు 22 మంది ఎంపీలుండి రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయలేదని తెదేపా నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇప్పుడు మరో ఎంపీని పంపితే ప్రధాని మోదీ కాళ్లు పట్టుకోవడానికి మరొకరు జతకలుస్తారే తప్ప.. ఒరిగేదేమీ లేదన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా నేతలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.

TDP Legislative Council member Yanamala
తెదేపా నేత యనమల రామకృష్ణుడు

By

Published : Apr 15, 2021, 8:11 PM IST

అణుబాంబుల దాడి కంటే అవినీతిపరుల పాలన అత్యంత ప్రమాదకరమని గ్రహించి.. తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా నేతలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని తెదేపా శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు కోరారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి అరాచకాలు, ఆకృత్యాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని మండిపడ్డారు.

రెండేళ్ల వైకాపా పాలనలో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి మీ వంతు పోరాటంగా ఓటు వేసే ముందు బాధ్యతతో ఆలోచించాలని ఆయన కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details