ఇదీ చూడండి:
'బొత్సని సీఎం జగన్ వెనకేసుకొస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు' - శాసనమండలి వార్తలు
మతం పేరుతో దూషించడం మంత్రి బొత్స రౌడీయిజానికి నిదర్శనమని విజయవాడలో తెదేపా నేత మహమ్మద్ నసీర్ మండిపడ్డారు. ఛైర్మన్‌గా తనకున్న హక్కు ప్రకారమే షరీఫ్ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. అది చూసి ఓర్వలేని మంత్రులు బొత్స, అనిల్, షరీఫ్‌పై దాడికి యత్నించడం దారుణమని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన బొత్సపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం జగన్ ... బొత్సని వెనకేసుకొస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
విజయవాడలో తెదేపా నేతల మీడియా సమావేశం