అమరావతి ప్రాంతంలో 797 మంది తెల్ల రేషన్‌కార్డులు 700 ఎకరాల భూములు కొన్నారని సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ వెల్లడించారు. విశాఖలో గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఈటీవీ భారత్‌తో మాట్లాడారు. అమరావతి భూముల విషయంలో సీఐడీ నమోదు చేసిన కేసులను వివరించారు. కనీసం నెలకు ఐదు వేల రూపాయల ఆదాయం లేని వారు... కోట్లు విలువచేసే భూములు కొన్నారని ఆయన చెప్పారు. ఈ విషయంలో 797 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సునీల్‌కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి