మద్యం షాపులు తెరవడంతో 40 రోజులుగా చేసిన లాక్ డౌన్ దీక్ష బూడిదలో పోసిన పన్నీరు అయిందని మాజీ శాసనసభ్యుడు తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో లాక్ డౌన్ వేళ మద్యం అమ్మకాలను నిరసిస్తూ దీక్షలు చేస్తున్న మహిళలకు సంఘీభావం తెలిపారు. మద్యపాన నియంత్రణ కోసమే ధరలు పెంచామంటే చిన్నపిల్లలు కూడా నమ్మరని ఎద్దేవా చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మద్యం దుకాణాలు తెరవడమేంటని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని నాసిరకం బ్రాండ్లతో దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పచ్చగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టి.. ప్రజలను మద్యానికి బానిసగా చేయడం వైకాపా ప్రభుత్వానికి చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ప్రజల ఆరోగ్యాన్ని మద్యానికి పణంగా పెడుతున్నారు'
లాక్డౌన్ అమల్లో ఉండగా...మద్యం దుకాణాలు తెరిచి ప్రభుత్వం ప్రజల సంసారంలో చిచ్చుపెడుతుందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.
tdp leaders