ఇదీ చూడండి:
'రాష్ట్ర మంత్రులు శాసనమండలి ప్రతిష్ఠను దిగజార్చారు'
రాష్ట్రమంత్రులు మండలి ఛైర్మన్ షరీఫ్‌పై భౌతికదాడికి యత్నించడం ఆయన్ని దుర్భాషలాడటం సిగ్గుమాలిన చర్యని తెదేపా కార్యదర్శి హిదాయత్ మండిపడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలినాని, అనిల్‌కుమార్‌లు శాసనమండలి ప్రతిష్ఠను అవహేళన చేశారని దుయ్యబట్టారు. షరీఫ్‌పై వారు చేసిన దాడిని మొత్తం ముస్లిం సమాజంపై చేసిన దాడిగానే భావిస్తున్నామన్నారు. సీఎం జగన్‌కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా నేత