కొడాలి నాని, వల్లభనేని వంశీ, కృష్ణప్రసాద్ లు కృష్ణాజిల్లాను నాశనం చేయడానికి, దోచుకోవడానికి పోటీపడుతున్నారని తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబనే సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసునని బ్రహ్మం గుర్తుచేశారు. కొడాలినాని, వల్లభనేని వంశీ, కృష్ణప్రసాద్ లు అడ్డగోలుగా ప్రేలాపనలు చేయడం మానుకోవాలని తీవ్రఆరోపణలు చేశారు. పదవులు కాపాడుకోవడానికి ఇష్టానుసారం తిట్టడం మానేసి, తమ సొంత జిల్లా గురించి ఆలోచిస్తే మంచిదని హితవుపలికారు.
ఆ ముగ్గురూ జిల్లాను నాశనం చేస్తున్నారు: నాదెండ్ల బ్రహ్మం
కృష్ణాజిల్లా వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, కృష్ణప్రసాద్ల పై తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం తీవ్రంగా మండిపడ్డారు. జిల్లాను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అనవసరమైన ఆరోపణలు మాని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు.
nadendla bhramha