కరోనా వ్యాప్తికి కారణమవుతున్న మద్యం దుకాణాలను ప్రభుత్వం తక్షణమే మూసివేయాలని తెదేపా నేత కాకి గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ "మొదటి దశలోనూ మద్యం షాపులు తెరిపించిన ప్రభుత్వం.. కరోనా వ్యాప్తికి బాటలు వేసింది. ఆదాయం చూసుకుంటున్న ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని విమర్శించారు.
'ప్రభుత్వం తక్షణమే మద్యం దుకాణాలను మూసివేయాలి'
మద్యం దుకాణాలను ప్రభుత్వం తక్షణమే మూసివేయాలని తెదేపా నేత కాకి గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. ఈ వైన్షాపులే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయన్నారు. మొదటి దశలోనూ మద్యం షాపులు తెరిపించిన ప్రభుత్వం.. కరోనా వ్యాప్తికి బాటలు వేసిందని విమర్శించారు.
తెదేపా నేత కాకి గోవిందరెడ్డి
ప్రభుత్వం రాష్ట్రంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్లకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వని సీఎం, అనేకమందిని ఉద్యోగాల నుంచి తొలగించారన్నారు. కరోనాను కట్టడి చేయాలని ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తున్న ముఖ్యమంత్రి.. తాను మాత్రం బయటకు రావట్లేదని విమర్శించారు.
ఇవీ చదవండి