ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 19, 2020, 12:18 PM IST

ETV Bharat / state

అందుకే స్థానిక ఎన్నికలంటే సీఎం భయపడుతున్నారు: దివ్యవాణి

వైకాపా ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలు గమనించి.. వారికి ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెదేపా మహిళా నేత దివ్యవాణి అన్నారు. అందుకు భయపడే స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నారన్నారు.

divya vani
దివ్యవాణి, తెదేపా అధికార ప్రతినిథి

సీఎం జగన్ ప్రవేశపెట్టిన 'నాడు-నేడు' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. నాడు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు, నేడు వాటిని అమలు చేస్తున్న తీరు పరిశీలిస్తే అన్నింటిలోనూ మోసమే ఉందని మండిపడ్డారు. అరచేతిలో వైకుంఠం చూపించి, ప్రజలకు పెద్దనామం పెట్టారని ధ్వజమెత్తారు.

మహిళలకు నాడు ఎన్నో హామీలిచ్చి.. నేడు ప్రతి మహిళకు లక్షా 5వేల రూపాయలు బాకీ పడ్డారని ఆరోపించారు. 45 ఏళ్లకే పింఛన్, సన్నబియ్యం ఇస్తామని చెప్పడం.. కేంద్రం మెడలు వంచుతానని వారి ముందు మోకాళ్లపై నిలబడటం వంటివన్నీ ప్రజలు గమనించారన్నారు. ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నందుకే.. సీఎం జగన్ భయపడి స్థానిక సంస్థల ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నారని దివ్యవాణి దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details