ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట.. ఇంద్‌ భారత్‌ కేసులో తదుపరి కార్యాచరణపై ఆదేశాలు

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇంద్‌ భారత్‌ కేసులో తదుపరి కార్యాచరణకు దిగొద్దని సీబీఐకు సుప్రీం ఆదేశించింది. ఆరు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆర్బీఐను ఆదేశించింది.

rrr
rrr

By

Published : Oct 2, 2022, 8:52 AM IST

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన విద్యుత్‌ ఉత్పదన సంస్థ ఇంద్‌ భారత్‌ బ్యాంకు రుణాల కేసులో.. తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఆర్బీఐ 2016 జులై 1న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఇంద్‌ భారత్‌ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటిస్తూ.. గతేడాది డిసెంబర్‌ 6న తెలంగాణ హైకోర్ట్‌ తీర్పు ఇచ్చింది. కంపెనీ ఖాతా లావాదేవీలపై బ్యాంకులతో పాటు సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయొచ్చంటూ కోర్టు అనుమతిచ్చింది. రిజర్వు బ్యాంక్‌ సర్క్యులర్‌ను సవాలు చేస్తూ.. ఎంపీ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అజయ్‌ రస్తొగి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ఆర్బీఐ సర్క్యులర్‌లోని లోపాలను ఎత్తిచూపారు. మోసపూరిత ఖాతాలుగా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనల అనంతరం ధర్మాసనం ఆర్బీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details