కృష్ణాజిల్లా అవనిగడ్డ,ఎడ్ల లంక మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు పర్యటించారు. మోకాలు లోతు నీళ్లు రావడంతో పాటు ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో మంత్రులు ట్రాక్టర్లో పరిస్థితిని పర్యవేక్షించారు. మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకట్రామయ్య,అనిల్ కుమార్ యాదవ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబులు ట్రాక్టర్‌పై వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే కొన్ని కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ట్రాక్టర్లలో ప్రయాణించి వరదను పర్యవేక్షించిన మంత్రులు - avanigadda
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. మోకాలి లోతు వరకు నీటి ప్రవాహం ఉండటంతో ట్రాక్టర్లో ప్రయాణించి పరిస్థితి పర్యవేక్షించారు.
ట్రాక్టర్లో వెళ్లి వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రులు