ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఇసుక రవాణా ధర నిర్ణయం

రాష్ట్రంలో ఇసుక తీయటం, లోడింగ్, రవాణా, డోర్​ డెలివరీకి సంబంధించిన ధరల్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

sand in ap
sand in ap

By

Published : Aug 11, 2020, 5:22 AM IST

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, రవాణా, సరఫరా ధరల్ని ప్రభుత్వం నిర్ణయించింది. తవ్వకాల నుంచి వివిధ స్థాయిల్లో బేస్‌ రేట్లను నిర్ణయిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఓపెన్‌ రీచ్‌లు, పట్టాదారు భూముల్లో ఇసుక మైనింగ్‌ రుసుం టన్నుకు 90 రూపాయలుగా నిర్ణయించింది. జేసీబీల ద్వారా లోడింగ్‌ ఫీజును టన్నుకు 25 రూపాయలుగా ఖరారు చేసింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణా చేసేందుకు.... జీఎస్టీతో కలిపి 3 రూపాయల 30 పైసలగా నిర్ధరించింది. డోర్‌ డెలివరీ కోసం 10 కిలోమీటర్ల లోపు దూరానికి టన్ను ఇసుకకు.... కిలోమీటర్‌కు ట్రాక్టర్‌ ద్వారా 10 రూపాయలు, లారీ అయితే 8, పెద్ద లారీకి 7 రూపాయల ధరను నిర్ణయించారు. 40 కిలోమీటర్ల దూరం వరకూ ఇవే ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకన్నా ఎక్కువ దూరమున్న ప్రాంతాలకు ప్రతి టన్ను ఇసుక రవాణాకు కిలోమీటర్‌కు 4.90 రూపాయల ధర నిర్ణయించింది.

ABOUT THE AUTHOR

...view details