మహిళా రిజర్వేషన్ అమలులో పాలకులకు చిత్తశుద్ధి లేదని మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని అన్నారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ అమలు కోసం జులై 9వ తేదీ నుంచి ఆగష్ట్ 9 వరకు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, కరోనా ప్రభావం ఉన్నంతకాలం కుటుంబానికి నెలకు 7500 రూపాయలు లేదా 13 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలన్నారు. పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 13న రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతామన్నారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని.. మహిళా భద్రత చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. మహిళలకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు.