కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకలో కరకట్ట దిగువన మామిడి తోటల్లో నివేశనా స్థలాల కోసం అధికారులు సుమారు ఇరవై ఎకరాలు సేకరించారు. ఇటీవల కృష్ణా నదికి 7 లక్షల క్యూసెక్యుల వరద విడుదల చేయగా.. నివేశనా స్థలాలకు వెళ్లే బాట వరద నీటితో మునిగిపోయింది. లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.
వరద ముంపు ప్రాంతంలో నివేశనా స్థలాలు పనికిరావని ముందు నుంచి అవనిగడ్డ తెదేపా నాయకులు, కార్యకర్తలు అవనిగడ్డ తహసీల్దార్‌కు అనేక వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వరద వారం గడచినా తొలగలేదని వాపోయారు. వరద ముంపు లేని ప్రదేశంలో నివేశన స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.