ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కన్న కొడుకులు వదిలేశారు.. పరాయివాళ్లు చేరదీశారు!

By

Published : Sep 3, 2020, 9:34 PM IST

ఆ తల్లి నవమాసాలు మోసి కుమారులను కన్నది. వాళ్లు పెరిగి పెద్దయ్యారు. ఉద్యోగం చేస్తున్నా సరే.. తల్లిని భారంగా భావించారు. అంతే.. తీసుకొచ్చి దిక్కూ మొక్కూ లేకుండా చేసి బస్టాండ్​లో వదిలి వెళ్లిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లి నడవలేని స్థితిలో ఉంది. ఆకలి బాధతో అలమటించింది. ఇది చూసి చలించిపోయిన గ్రామ సచివాలయ సిబ్బంది ఒకరు ఆ వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.

son left his mother on road
son left his mother on road

కృష్ణా జిల్లా తిరువూరు మండలం చింతలపాడు బస్టాండ్​లో.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కుమారులు వదిలి వెళ్లారు. మైలవరం మండలం పుల్లూరు శివారు దాసుళ్లపాలెంనకు చెందిన వృద్ధురాలిని ఆటోలో తీసుకువచ్చి బస్టాండ్​లో అనాధగా వదిలేశారు. ఆకలి బాధ ఒకపక్క వయసు సహకరించక నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను గమనించిన చింతలపాడు గ్రామ సచివాలయం సిబ్బంది మల్లెల సహకార సంఘం అధ్యక్షుడు కలకొండ రవికుమార్​కు సమాచారం అందించారు.

స్పందించిన ఆయన తిరువూరు పట్టణంలో ఐడియాస్ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న సౌరిని సంప్రదిచగా విస్సన్నపేట ఆశ్రమంలో చేర్పించాలని సూచించారు. కలకొండ రవికుమార్ ఆమెను తానే స్వయంగా తీసుకెళ్లి విస్సన్నపేట వృద్ధాశ్రమంలో చేర్చి మానవత్వం చాటుకున్నారు. ఒక కుమారుడు విశాఖపట్నంలో, మరో కుమారుడు గంపలగూడెంలో ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details