ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాలను అభివృద్ధి చేయడమే భాజపా లక్ష్యం: సోమువీర్రాజు - చందర్లపాడు వార్తలు

గ్రామాలను అభివృద్ధి చేయడమే మోదీ లక్ష్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పూజ చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జనసేన భాజపా కలిసే పని చేస్తాయని స్పష్టం చేశారు.

Somuveeraju inaugurated  BJP office
సోమువీర్రాజు

By

Published : Jan 28, 2021, 5:26 PM IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడులో భాజపా కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రారంభించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి స్వాగతించారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. డిజిటల్ ఇండియాతో గ్రామాలను అనుసంధానం చేశారని వివరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి నిధులిచ్చిందన్నారు. వాటిని సరైన క్రమంలో వాడలేదని ఆరోపించారు. మోదీ దృష్టి గ్రామాల అభివృద్ధేనని పునరుద్ఘాటించారు.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి..

ఎన్నో వివాదాల నడుమ పంచాయతీ ఎన్నికలు జరగడం దురదృష్టకరమని సోమువీర్రాజు పేర్కొన్నారు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని.. అది ప్రజల హక్కు అని తెలిపారు. ఏకగ్రీవల పేరిట వైకాపా కొత్తపోకడలకు పోతోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జనసేన భాజపా కలిసే పని చేస్తాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'ప్రార్థన, భక్తి పేర్లతో జరిగే హత్యలను ప్రభుత్వం నిరోధించాలి'

ABOUT THE AUTHOR

...view details