విజయవాడ నగర శివారు నూజివీడు రహదారి సూరంపల్లి అడ్డరోడ్డులో నగరం నుంచి గ్రామాలకు వెళ్ళే ద్విచక్రవాహనదారులపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు గన్నవరం పోలీసులు.
విజయవాడ నగరంలో కూరగాయలు, మామిడికాయల అమ్మకాలు జరిపి తిరిగి ఇళ్ళకు చేరుకునే వాహనదారులు, రైతులపై వైరస్ నాశక రసాయన ద్రావణం చల్లారు. కరోనా నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.