కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో నెల రోజులుగా సుమారు 100 మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఏడుగురు చనిపోయారు. పాము కాటు సమస్యను స్థానిక శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పాముకాట్లపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు అంగన్వాడీ, ఆశావర్కర్లతో అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో పాముకాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వీఆర్వో, వీఆర్ఏ, నర్సులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయనున్నారు. ఇక మీదట పాముకాటుతో మరణాలు సంభవిస్తే సంబంధిత గ్రామ అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
పాముకాటుపై అవగాహన సదస్సు
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పాముకాట్లపై అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.
అవగాహన సదస్సు