ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాగుంది గురి... పతకం ఖాయం ఈసారి...

రైఫిల్ షూటింగ్... ఖర్చుతో కూడుకున్న క్లిష్టమైన క్రీడ. ఇందులో రాణించాలంటే ఏకాగ్రత, నేర్పు, సాధన అవసరం. అలాంటి రైఫిల్ షూటింగ్‌లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు బెజవాడ చిచ్చరపిడుగులు. ఓ అకాడమీలో శిక్షణ తీసుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించారు. యూత్ ఒలింపిక్స్‌లో కోసం శ్రమిస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న ఈ క్రీడ శిక్షణలో ప్రభుత్వ సహకారిస్తే సత్తా చాటుతామంటున్నారు.

shooting

By

Published : Jul 22, 2019, 3:34 PM IST

బాగుంది గురి... పతకం ఖాయం ఈసారి...
విజయవాడలోని రైఫిల్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో భావిషూటర్లు శిక్షణ పొందుతున్నారు. త్వరలో జరగనున్న యూత్ ఒలింపిక్స్‌లో పథకాలు సాధనే లక్ష్యంగా కఠోరంగా శ్రమిస్తున్నారు. తలిదండ్రులు, గురువు పెట్టుకున్న ఆశలు నెరవేర్చేందుకు ఏకాగ్రతతో కసరత్తు చేస్తున్నారు. రక్షణ రంగ మాజీ అధికారి,అంతర్జాతీయ షూటర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం సాగుతోంది. ఆయన శిక్షణపై, తమ పిల్లల ప్రతిభపై తలిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


క్రీడల్లో ఉన్నత శిక్షరాలకు వెళ్లాలనే ఉద్దేశంతో రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నామని.. యూత్ ఒలంపిక్స్‌లో రాణించి పతాకాలు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారీ బాలలు.
ఎయిర్ రైఫిల్ క్రీడ అధిక ఖర్చుతో కూడుకున్నదని... ప్రభుత్వం సహకరిస్తే మెరికల్లాంటి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని అశాభావంతో ఉన్నారు శిక్షకుడు సుబ్రహ్మణ్యేశ్వర్.

ఆర్థిక స్థోమత ఇబ్బంది పెడుతున్నా... పిల్లల ఉన్నతమైన భవిష్యత్‌ ఇవ్వాలని నిర్ణయించారీ తల్లిదండ్రులు.

ABOUT THE AUTHOR

...view details