అవనిగడ్డ.. బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం..! - sex rocket in avanigadda news
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ... బ్యూటీపార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.... వారిని అదుపులోకి తీసుకున్నారు.
బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న విజయవాడకు చెందిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఫోన్ కాంటాక్ట్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న విజయవాడకు చెందిన నిర్వాహకురాలు, ఆమెకు సహకరిస్తున్న ఇద్దరు వ్యక్తులు (విజయవాడకు చెందిన వారు), వీరి ద్వారా వ్యభిచారం వృత్తిలోకి దిగిన ఒక మహిళతో పాటు అవనిగడ్డకు చెందిన ఒక విటుడు.. మొత్తం ఐదుగురిని అవనిగడ్డలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు అవనిగడ్డ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యువకులను టార్గెట్ చేసి.. అమ్మాయిల ఫొటోలు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.