ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమ్మెకాలానికి వేతనం... విరమణ వయస్సు పెంపు' - ts rtc strike upadate

ఆర్టీసీ కార్మికుల సమ్మెకాలం వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని తెలంగాణ కేసీఆర్ వారికి హామీఇచ్చారు. ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. నాలుగు నెలల్లోనే ఆర్టీసీ లాభాల బాటపట్టాలని సూచించారు.

"సమ్మెకాలానికి వేతనం.. విరమణ వయస్సు పెంపు"
"సమ్మెకాలానికి వేతనం.. విరమణ వయస్సు పెంపు"

By

Published : Dec 1, 2019, 6:15 PM IST

'సమ్మెకాలానికి వేతనం... విరమణ వయస్సు పెంపు'

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలను సోమవారం అందిస్తామని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ హామీఇచ్చారు. సమ్మెకాలం వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వరాలు ప్రకటించారు.

సమ్మెకాలం వేతనాలు ఏకమొత్తంలో ఇస్తాం...

52 రోజులు సమ్మె కాలం జీతాన్ని ఆర్టీసీ కార్మికులకు చెల్లిస్తామని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. వీటితోపాటు ఆర్టీసీ మహిళా కార్మికులకు సౌకర్యాల కల్పనతోపాటు ప్రసూతి సెలవులకు వేతనాలు ఇస్తామని చెప్పారు. ఇకపై ప్రభుత్వానికి అధికారులకు ఈ సభ్యులు వారధిగా ఉండాలని సూచించారు. కార్మికులంతా ఆర్టీసీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని.. ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.

ఆర్టీసీలోనూ బోనస్‌ అమలు చేస్తాం...

కష్టపడి పనిచేస్తే సింగరేణి వలే ఆర్టీసీలోనూ బోనస్‌ ఇస్తామని కేసీఆర్​ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని... ఒక్క రూటులో కూడా ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details