కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భానుప్రకాష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని తన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుని మరీ తనువు చాలించాడు. చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేకే ప్రాణాలు వదులుతున్నాననీ.. తన చావుకు అప్పిచ్చిన అఖిల్, ఆయన తండ్రే కారణమని తెలిపాడు. తీసుకున్న అప్పుకు వడ్డీలు పెంచారనీ.. బైక్ లాక్కుని రోడ్డు మీద నిలదీశారనీ.. అందుకే మనస్తాపం చెంది ఈ చర్యకు పాల్పడుతున్నాననీ వీడియోలో రికార్డ్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో సాక్ష్యం - ఆత్మహత్య
సెల్ఫీలు సరదాకే కాదు ప్రాణాలు తీసుకుంటున్నామని తెలియచెప్పడానికి వాడుతున్నారు. తాము చనిపోతున్నామంటూ వీడియో తీసుకుని మరీ ప్రాణాలు వదులుతున్నారు. ఆ తరహా ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో సాక్ష్యం
Last Updated : May 20, 2019, 11:14 AM IST