ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పచ్చని ఒడిలో.. ప్రకృతి బడిలో..! - poor

నా.. అంటూ లేని చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఒక బడి... అందువలో పచ్చని పల్లె అందాలు... ప్రకృతి ఒడిలో చదువు చెప్పే హీల్ ప్యారడైజ్ పాఠశాల. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో... ప్రకృతి ఒడిలో పచ్చని బడిలా అత్యున్నత సేవలు అందిస్తోంది.

school-for-poor-childrens

By

Published : Aug 13, 2019, 6:57 PM IST

తోటపల్లిలో అనాధ పిల్లల కోసం ప్రత్యేక బడి

వైద్యునిగా అమెరికాలో ఉన్నత స్థాయిలో జీవిస్తున్న ఆంధ్రుడు డాక్టర్ సత్యప్రసాద్.. హీల్ ప్యారడైజ్ పేరుతో అనాథ పిల్లలకు వెలకట్టలేని సేవ చేస్తున్నారు. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో అనాధల కోసమే ప్రత్యేకంగా ఒక బడి కట్టించారాయాన. సువిశాలమైన 25 ఎకరాల స్థలంలో.. పచ్చని పల్లె అందాల మధ్యలో... ప్రకృతి ఒడిలో పాఠశాలనూ అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ 600 మంది విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయిలో చదువుకుంటున్నారు. పరిపూర్ణమైన సేంద్రీయ ఆహారం అందుకుంటున్నారు. ఈ గుడి-బడి నిర్వహణను... సత్యప్రసాద్ సోదరి లక్ష్మి, మరికొందరు సభ్యులు చక్కబెడుతుంటారు. ఇక్కడ వెచ్చించే ప్రతి పైసా దాతల విరాళమే అంటున్నారు నిర్వాహకురాలైన లక్ష్మి. రేటెడ్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు వలంటీర్లగా సేవలందిస్తుంటారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details