జగన్తో రాజన్న రాజ్యం సాకారం: బాలశౌరి - mp
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపే లక్ష్యంగా వైకాపా పని చేస్తుందని మచిలీపట్నం నుండి ఎంపీగా గెలుపొందిన బాలశౌరి అన్నారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతే వైకాపా అఖండ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు.
వైకాపా నేత బాలశౌరి
జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకున్నారని మచిలీపట్నం నుండి ఎంపీగా గెలిచిన బాలశౌరి అన్నారు. వైకాపా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడపడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. జగన్‌కు ప్రభుత్వం పైనున్న వ్యతిరేకతే వైకాపా విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు.