కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతరాలయంలోకి వర్షపు నీరు ఉబికి వస్తోంది. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగటం వల్ల భూమట్టానికి కింద ఉన్న స్వామి గర్భగుడిలోకి ఊటనీరు ఉబికి వస్తోంది. విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడుతున్నప్పటికీ ఫలితం లేకపోతోంది. ఈ ఊట కారణంగా స్వామివారి గర్భాలయంలో జరిపే రుద్రాభిషేకం, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. స్వామివారి నిత్య కళ్యాణం, నాగపుట్టలో పాలు, అభిషేకాలు యథావిధిగా జరిగాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉబికి వస్తున్న గంగమ్మ - mopidevi temple news in krishna district
కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అంతరాలయంలోకి వర్షపు నీరు చేరింది. గర్భాలయంలోకి ఉబికి వస్తోన్న వర్షపు నీటితో.. స్వామివారి రుద్రాభిషేకం, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.
temple