దాదాపు దశాబ్ధం తర్వాత ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు కృష్ణమ్మ ఉరకలు వేస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాలన్నీ సందర్శకులతో సందడిగా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద అంతకంతకూ పెరుగుతన్నందు వల్ల.. దిగువకు విడుదలయ్యే నీటి ప్రవాహం సైతం పెరుగుతోంది. చాలాకాలం తర్వాత బ్యారేజీ మొత్తం గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు. పాలపొంగులా నురగలు కక్కుతూ పారుతున్న నీటి దృశ్యాలను చరవాణుల్లో బంధించేందుకు సందర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు.
కృష్ణమ్మ గలగలా... ప్రకాశంలో జనకళ - rain
కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తోన్న వరదను గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉరకలను చూసేందుకు సందర్శకులు పోటీపడుతున్నారు. బ్యారేజ్ జలకళతో... పరిసర ప్రాంతాలు జనకళను సంతరించుకున్నాయి.
ప్రకాశం బ్యారేజ్ కు సందర్శకుల తాకిడి