ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందుబాబు లొల్లి... కానిస్టేబుల్​ జాలి - మందుబాబును కాపాడిన పోలీసు

పోలీసులంటే మనసే ఉండదని అని అంటుంటారు కొందరు. వారిలోనూ దయార్ద్ర హృదయులు ఉంటారని నిరూపించారు ఈ పోలీసాయన. తప్పతాగి రోడ్డు పై అచేతనంగా పడి ఉన్న వ్యక్తిని రక్షించి అందరి ప్రశంసలు పొందుతోన్న ఆ పోలీసు కథేంటో మనమూ తెలుసుకుందామా...!

పోలీసు కాపాడెను మందుబాబును!

By

Published : Oct 31, 2019, 8:46 AM IST

Updated : Oct 31, 2019, 9:08 AM IST

మందుబాబును కాపాడిన పోలీసు అధికారి

నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతం బందరు బస్​ స్టాండ్​... రాత్రి 11 గంటల సమయం... ఎవరింటింకి వారు వెళ్లే హడావుడి... అక్కడ పూటుగా మద్యం సేవించి అచేతనంగా పడి ఉన్న ఓ మందుబాబు. మత్తులో తూగుతోన్న వ్యక్తిని చూసి అందరూ తప్పుకు పోవటమే తప్ప పట్టించుకునే వారే లేరు. సరిగ్గా ఆ సమయంలోనే గస్తీ నిర్వహించే ఓ పోలీసు కానిస్టేబుల్​ అక్కడకు వచ్చారు. ప్రమాదకర మలుపులో అచేతనంగా పడి ఉన్న మందుబాబును గుర్తించారు. వెంటనే స్పందించి అతన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తరువాత ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేశారు. దీనిపై అక్కడివారు ఆ పోలీసును ప్రశసించారు. ఇక్కడ కొసమెరుపేంటంటే మత్తు వదిలిన ఆ వ్యక్తి అన్యాయంగా నన్నెందుకు పట్టుకున్నారంటూ నానా హంగామా చేశాడు.

Last Updated : Oct 31, 2019, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details