కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రి వద్ద హైవేపై వెళ్తున్న లారీ డ్రైవర్ను అటకాయించి, నగదు, సెల్ ఫోన్ దొంగిలించిన కేసులో ప్రధాన ముద్దాయి కానూరుకు చెందిన యోగి హేమంత్ సాయి అలియాస్ 'నాని బ్రో' ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరిచారు.
robbery: వాహనదారులే లక్ష్యంగా దోపిడీ.. నిందితుల అరెస్ట్ - కృష్ణాజిల్లా నేర వార్తలు
గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రి వద్ద హైవేపై వెళ్తున్న లారీ డ్రైవర్ నుంచి నగదు, సెల్ఫోన్ దొంగిలించిన కేసులో ప్రధాన నిందితుడు యోగి హేమంత్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో హాజరుపరిచారు.
వాహదారులే లక్ష్యంగా దోపిడి...నిందితుల అరెస్ట్
ఈ కేసులో ఇతర నిందితులను జూన్ 4 తేదీన కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితుడు బాలుడు కావడంతో జువైనల్ కోర్టులో జస్టీస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. వీరు పెనమలూరులో రెండు ద్విచక్రవాహనాలు, గన్నవరం రైతు బజారులో మూడు, చిన్నఅవుటపల్లిలోని మరో బడ్డీ కొట్టు తాళాలు పగలకొట్టి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి ఓ యూనికార్న్ ద్విచక్రవాహనం సీజ్ చేశారు. యోగి హేమంత్ సాయిని కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు.
ఇదీ చదవండి:
Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా ప్రథమ ప్రాధాన్యత విద్యకే: అశోక్ గజపతిరాజు
Last Updated : Jun 18, 2021, 7:37 AM IST