ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏపీలో పరిస్థితి ఎలా ఉంది?'... సీఎం జగన్​కు ప్రధాని ఫోన్

ప్రధాని మోదీ.. రాష్ట్ర సీఎం జగన్ కు ఫోన్ చేశారు. వర్షాలు, అనంతర పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రితోనూ ఫోన్​లో ప్రధాని మాట్లాడారు.

pm modi phone to cm jagan
pm modi phone to cm jagan

By

Published : Oct 14, 2020, 8:42 PM IST

Updated : Oct 14, 2020, 9:06 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు ప్రధాని మోదీ బుధవారం ఫోన్‌ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు, అనంతర పరిస్థితులను పీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షప్రభావిత ప్రాంతాలు, పరిస్థితులు, అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆయనకు సీఎం జగన్ వివరించారు. సహాయక చర్యల్లో కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కూడా ప్రధాని ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.


అమిత్​షా ట్వీట్

మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల్లోని బాధిత ప్రజలకు సాధ్యమైనంతవరకు సహాయం అందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి

భారీవర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

Last Updated : Oct 14, 2020, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details