ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల ఆధ్వర్యంలో.. మొక్కలు నాటే కార్యక్రమం

లాఠీలు ఉండవలసిన చేతుల్లో మెుక్కలు దర్శనమిస్తున్నాయి. గంభీరంగా ఉండే ముఖం చిరునవ్వులు చిందిస్తూ మెుక్కల పెంపక ఆవశ్యకతను విద్యార్ధులకు వివరిస్తున్నారు ఆ పోలీసు అధికారులు.  వారే విజయవాడ పటమట పోలీస్ శాఖ అధికారులు.

By

Published : Jul 3, 2019, 12:12 PM IST

పర్యావరణానికీ రక్షక భటులు

పర్యావరణానికీ రక్షక భటులు

మెుక్కల పెంపకం ద్వారా పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పోలీసు శాఖ భాగమైంది. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ సిఐ దుర్గారావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మెుక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఏసీపీ, సిఐ ఎస్సైలు కలిపి దాదాపు 100 మది మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న ఏసీపీ అంకినీడు ప్రసాద్ విద్యార్ధులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి మెుక్కలు నాటాలని సూచించారు. మెక్కలే మనిషికి జీవనాధారమని, మానవాళి మనుగడ కొనసాగాలంటే మెుక్కలు పెంచాలని విద్యార్థులకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేసిన మెుక్కలే రేపు మీకు గుర్తులుగా ఈ పాఠశాలలో ఉంటాయని విద్యార్ధులతో ఏసీపీ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details