2018 - 19 సంవత్సరానికి డీఎడ్ కు చెందిన సుమారు 20 వేల మంది స్పాట్, మేనేజ్మెంట్ కోటలో సీట్లు పొంది.. ఏడాదిన్నర పాటు చదివిన విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఫలితంగా... రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది విద్యార్థుల భవిష్యత్ రోడ్డున పడబోతుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరారు.
'విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలి' - pdsu protest at vijayawada
రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది డీఎడ్ విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడబోతుందని ప్రగతిశీల సంస్థ అధ్యక్షుడు, ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు.
సమావేశంలో పీడీఎస్యూ కార్యకర్తలు