ఉల్లిపాయలు కోసేటప్పుడే కాదు...కొనేటప్పుడూ కన్నీళ్లు వచ్చే పరిస్థితి ప్రతి సామాన్యుడి కుటుంబంలో నెలకొంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలను అందిస్తోంది. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు రైతుబజార్లో కిలో రూ.25కే ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో 50 రూపాయిలకు పైగా ఉండటంతో సామాన్య ప్రజలు ఎంతో సంతోషంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే మనిషికి కిలో అనే నిబంధనను సవరించి కనీసం రెండు కిలోలు ఇస్తే మధ్య తరగతి కుటుంబాలకు 15రోజుల పాటు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాయితీపై ఉల్లి సరఫరా...రూ.25కే కిలో.. - కంకిపాడు రైతుబజారులో కిలో ఉల్లిని 25రూపాయిలకే
రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరగటంతో ప్రభుత్వం రాయితీపై ఉల్లిని సరఫరా చేస్తోంది. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు రైతుబజారులో కేజీ ఉల్లిని 25 రూపాయిలకే అందిస్తున్నారు.
రాయితీపై ఉల్లి సరఫరా