ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: సరిహద్దు వివాదం.. దాడిలో ఒకరు మృతి - కష్ణా జిల్లాలో సరిహద్దు వివాదాలు

సరిహద్దు వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం, చిలకలపూడి గ్రామంలో సరిహద్దు వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు.

one person died in border issue at krishna district gantasala
one person died in border issue at krishna district gantasala
author img

By

Published : Jun 19, 2021, 9:44 AM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిలకలపూడి గ్రామంలో దారుణం జరిగింది. సరిహద్దు వివాదంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొణతం రామయ్య, కుమారుడు సాంబశివరావు మరో ఐదుగురుతో కలిసి పంది వీరప్రసాద్ (ప్రభాకర్ రావు)పై దాడి చేశారు.

బలమైన ఆయుధాలతో దాడి చేయడంతో వీరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వీరప్రసాద్ కుమారుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘంటసాల ఎస్సై లక్ష్మీ నరసింహమూర్తి, చల్లపల్లి సి.ఐ. శ్రీనివాసరావు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details