పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది అంకానికి చేరడంతో కృష్ణా జిల్లాలోని ఆయా గ్రామ క్లస్టర్లల్లోని కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. చందర్లపాడు మండలంలోని చందర్లపాడు పంచాయతీకి తెదేపా మద్దతుతో కస్తాల మౌనిక నామినేషన్ వేశారు. పార్టీ శ్రేణులు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ ప్రక్రియను పూర్తిచేశారు.
చివరిరోజు నామినేషన్ల పర్వం.. సందడిగా గ్రామ క్లస్టర్లు
కృష్ణా జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరిరోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. వైకాపా, తెదేపా, జనసేన, వామపక్ష పార్టీల మద్దతుదారులు ఉత్సాహంగా నామినేషన్లు వేస్తున్నారు.
చివరిరోజు నామినేషన్ల పర్వం
పెనమలూరు నియోజకవర్గంలో చివరిరోజు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన వైకాపా, తెదేపా మద్దతుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. వీరితో పాటు పలు గ్రామాల్లో జనసేన, వామపక్ష పార్టీల మద్దతుతో పలువురు నామినేషన్లు వేశారు. అభ్యర్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఆయా క్లస్టర్ అధికారులు, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.