ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కనీసం మరో రెండు రోజుల పాటు.. ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఈ విషయాన్ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వం ఈ విషయంపై అప్రమత్తమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు.
మరోవైపు.. ముంపు ప్రాంతాలకు, తీర ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారు. విశాఖకు 2, పోలవరం దేవీపట్నానికి 2, భద్రాచలం 1, కర్ణాటకకు 4 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బయల్దేరాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు మరో 4 బృందాలను.. ఉన్నతాధికారులు సిద్ధం చేశారు.