ముఖ్యమంత్రి జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్‌కి తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం.. ప్రజారోగ్యంపై లేకపోవటం విచారకరమన్నారు.
మద్యం షాపుల ముందు క్యూ పెట్టి.. భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టారు కానీ.. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద మాత్రం చేతులెత్తేశారని దుయ్యబట్టారు. ఈ చర్యలతో కొవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు.