ఎస్సీలకు మాయమాటలు చెప్పి వైకాపా ఓట్లు దండుకుందని తెదేపా నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక వైకాపా ప్రభుత్వం ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి.. అరెస్టులు చేస్తుందన్నారు. పోలీసు ఉన్నతాధికారులు సత్వరం దీనిపై స్పందించాలని ఆయన పేర్కొన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఎస్సీలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంది: నక్కా ఆనందబాబు - nakka anandbabu fire on ysrcp
వైకాపా ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని తెదేపా నేత నక్కా ఆనందబాబు అన్నారు. ఎస్సీల విషయంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎస్సీలపై అక్రమ కేసులు పెట్టి.. అరెస్టులు చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
nakka anandbabu