ఇదీ చదవండి:
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింల ఆందోళన - Muslims protest in protest of citizenship amendment bill
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. మైనార్టీ వర్గాలను అణగదొక్కాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని ముస్లిం పెద్దలు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేసి తప్పు సరిదిద్దుకోవాలని కోరారు.
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింల ఆందోళన