అధికార పార్టీ నేతలు ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని చిత్ర హింసలకు గురి చేస్తున్న ఘటన విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో జరిగింది. వైకాపా అండదండలతో ఏమి చేసినా తమకు చెల్లుతుందని... తన ఇంటిని కబ్జా చేసేందుకే కొందరు నేతలు నానా ఇబ్బందులు పెడుతున్నారని పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న మొరపాక పద్మావతి అనే మహిళ ఆరోపించింది. ఈ విషయంలో తనకు న్యాయం చెయ్యాలని విజయవాడ సీపీ, ఈస్ట్ డీసీపీ, పటమట సీఐని వెళ్లి పలుమార్లు కోరింది. అయినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. వెంటనే తనకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరుతోంది. న్యాయం జరగకపోతే... తనకు, మానసిక వికలాంగుడైన తన కుమారుడికి ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది.
నా ఇంటిని కబ్జా చేసేందుకు చూస్తున్నారు... కాపాడండి సారు..!
అధికార పార్టీ నేతలు ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని చిత్ర హింసలకు గురి చేస్తున్న ఘటన విజయవాడలోని రామవరప్పాడులో జరిగింది. తన ఇంటిని కబ్జా చేసేందుకే కొందరు నేతలు నానా ఇబ్బందులు పెడుతున్నారని మొరపాక పద్మావతి ఆరోపించింది. వెంటనే తనకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరుతోంది.
పారిశుద్ధ్య కార్మికురాలి ఆవేదన