ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే ఈ నెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మార్పీఎస్ నేతల నిర్వహించిన ఆందోళనలో పాల్గొని.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అక్కడి నుంచి విజయవాడ వస్తుండగా జగ్గయ్యపేట వద్ద మందకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చిన కారణంగానే.. అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనను హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో మందకృష్ణ మాదిగ - MRPS president
సీఎం జగన్... ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేపట్టిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మందకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు