ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎంపీఈవోలు వినూత్నంగా నిరసన చేశారు. మెడకు ఉరితాడు వేలాడ దీసుకుని..విజయవాడ ధర్నా చౌకలో ఆందోళన చేశారు. జిల్లా నియామక కమిటీ ద్వారా ఎంపికై విధులు నిర్వహిస్తున్న తమను...ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. 12 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. శాంతియుత నిరసనలతో ప్రభుత్వానికి సమస్యను తెలపాలని... ఎంపీఈవోలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు సూచించారు.
విజయవాడలో ఎంపీఈవోల వినూత్న నిరసన - ఎంపీఈవో
విజయవాడ ధర్నాచౌక్లో ఎంపీఈవోలు వినూత్న రీతిలో నిరసన చేశారు.
ఎంపీఈవోల వినూత్న నిరసన