తాము అధికారంలోకి వస్తే గ్రామ, పట్టణ, వార్డు వాలంటీర్లకు సముచిత స్థానం కల్పించి.. గౌరవప్రదమైన జీతం అందిస్తామని ఎంపీ కేశినేని నాని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 52, 38 డివిజన్లలో తెదేపా అభ్యర్థులు షేక్ సుఫియా, ఉమ్మడి చంటితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కేవలం రూ. 5 వేలు జీతమిస్తూ.. వాలంటీర్ వ్యవస్థతో వైకాపా సర్కారు వెట్టి చాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. పరోక్షంగా వారితో ఎన్నికల ప్రచారం చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ విషయాలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని ఎంపీ కోరారు.