విద్యార్థులపై నాగార్జున విశ్వవిద్యాలయ తాత్కాలిక ఉపకులపతి అనుచితంగా ప్రవర్తించారని ఎమ్మెల్సీ రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో విద్యార్థులతో సమావేశమైన ఆయన... మూడు రాజధానుల అంశంపై సందేహాలను లేవనెత్తిన విద్యార్థులపై దాడులు చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ రాజశేఖర్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఉద్ఘాటించారు. అంతవరకూ... విద్యార్థులు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
'ఏఎన్‌యూ ఉపకులపతి తీరు అమానుషం... వెంటనే తొలగించాలి'
నాగర్జున వర్సిటీ తాత్కాలిక ఉపకులపతి విద్యార్థులతో ప్రవర్తించిన తీరుపై ఎమ్మెల్సీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ దాసరి భవన్లో విద్యార్థులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన్ను తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులతో సమావేశమైన ఎమ్మెల్సీ రామకృష్ణ