భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. రాజధానిని తరలించకుండా అసైన్డ్ చట్టాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని వినతిపత్రం అందజేశారు. కొన్ని రోజులుగా అక్కడి పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతులు రాజధాని కోసం భూములిచ్చారని కొనియాడారు. ఇప్పుడు వారికి ఆదాయవనరులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టాలి కానీ... ఇలా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'రైతులకు ఆదాయవనరులు లేకుండా చేశారు'
భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ... ప్రభుత్వాలకు రైతులు భూమి ఇచ్చే పరిస్థితి లేకుండా వైకాపా చేస్తోందని... భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు.
భాజపా శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్
TAGGED:
mlc madhav comments on ycp