గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. ఐదేళ్లుగా తమపై అనేక అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురిచేశారని పలువురు వ్యక్తులు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ముందుకు వచ్చారు. గన్నవరంలో వంశీ అంటే అధికారులకు భయమని, బెదిరింపు ధోరణితో వంశీ తన కనుసన్నలతో పరిపాలన చేస్తున్నాడని అన్నారు. వంశీ బాధితులు చాలా మంది ఉన్నారని.. వారిని ఆదుకోవాలని కోరారు.
''వల్లభనేని వంశీ బాధితులను ఆదుకోండి'' - mla vallabhaneni vamsi mohan
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం ఎయిర్ పోర్టు భుముల సేకరణలో అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ పలువురు ఆరోపించారు.
వల్లభనేని వంశీ అక్రమాలను అడ్డుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్న బాధితులు