దివిసీమ ఉప్పెనలో అశువులు బాసినవారికి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ ఛైర్మన్ కడవకోళ్లు నరసింహారావు నివాళులు అర్పించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ అమరస్థూపం వద్ద.. నాటి ఉప్పెనలో అసువులు బాసిన వారికి ఎమ్మెల్యే అంజలి ఘటించారు. దివిసీమ ఉప్పెనకు నేటితో 43 ఏళ్లు పూరైందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గుర్తు చేశారు. జల ప్రళయాన్ని తలచుకుంటే దివిసీమ వాసులు నేటికీ భీతిల్లిపోతారని అన్నారు.
'వెంటాడే చేదు జ్ఞాపకం దివిసీమ ఉప్పెన'
దివిసీమ ఉప్పెనలో మరణించిన వారికి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నివాళులర్పించారు. దివిసీమ ఉప్పెన జ్ఞాపకాలు ఇంకా స్థానికులను వెంటాడతాయని అన్నారు.
దివిసీమ ఉప్పెనలో మరణించిన వారికి నివాళులు