ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

kanna babu on CBN: జగన్‌ను గద్దె దించడమే.. లక్ష్యంగా దుష్ప్రచారం : కన్నబాబు

minister kanna babu on paddy: సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలని గతంలో చంద్రబాబు అడగలేదా? అని ప్రశ్నించారు. రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొంటున్నామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

kanna babu on CBN
ఏపీ మంత్రి కన్నబాబు

By

Published : Dec 11, 2021, 6:18 PM IST

Kannababu on CBN: సీఎం జగన్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. వందల కోట్లు పక్కదారి పట్టించేలా గతంలో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడగలేదా? అని ప్రశ్నించారు. ప్యాకేజీకి ఒప్పుకున్న రోజే హోదా అంశం తెరమరుగైందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే గోదావరి ఎరువుల ప్లాంట్ అమ్మేశారన్న కన్నబాబు.. స్టీల్‌ప్లాంట్ విక్రయిస్తామని కేంద్రమే అంటుంటే రాష్ట్రంపై ఆరోపణలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని వైఎస్ ప్రారంభించారని.. ఆయన కుమారుడు పూర్తి చేస్తారన్నారు. తమ ప్రభుత్వం లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి కన్నబాబు తెలిపారు.

మంత్రి కన్నబాబు

‘‘ఎంపీల రాజీనామా అంటున్న చంద్రబాబుకు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌.. వైకాపా ఎంపీలతో రాజీనామా చేయించిన ఘటన గుర్తులేదా? గతంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో రూ.వందల కోట్లు పక్కదారి పట్టించేలా షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారు. అమరావతి కోసం ఊరేగింపులు, బంద్‌లు తమ బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడానికి చంద్రబాబు చేయిస్తున్నారు. ఏపీకి ప్యాకేజీ ఇచ్చినందుకు మోదీ ప్రభుత్వానికి అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు మా ప్రభుత్వానికి సుద్దులు చెబుతారా? - కన్నబాబు, రాష్ట్ర మంత్రి

పవన్​ దీక్ష చేస్తే మంచిదే..
విశాఖ ఉక్కుపై పవన్ కల్యాణ్‌ దీక్ష చేస్తే మంచిదేనని కన్నబాబు అన్నారు. అయితే.. దీక్షకు బదులు ప్రధాని వద్దకు వెళ్లి ఒత్తిడి చేస్తే ఇంకా మంచిదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టీల్‌ప్లాంట్‌ను అమ్మవద్దనే చెబుతోందని మంత్రి వెల్లడించారు. ఇళ్ల క్రమబద్ధీకరణ డిమాండ్‌ మేరకే ఓటీఎస్ అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి జరిగే మేలు కనిపించడం లేదా మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.

21 రోజుల్లోనే చెల్లిస్తున్నాం..
minister kanna babu on paddy: రైతులకు కేవలం 21 రోజుల్లోనే మద్దతుధర చెల్లిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల ధాన్యంలోనే తేమ ఎక్కువ ఉందన్నారు. అందువల్లనే మిల్లర్లు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. భారీ వర్షాలకు అనేక జిల్లాల్లో ధాన్యం తడిసిందన్నారు.

ఆర్​బీకేల్లోనే ధాన్యం కొనుగోళ్లు..
kannababu on RBK centers: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.3 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని 7,681 ఆర్‌బీకేల్లో ధాన్యం కొనుగోలుకు మ్యాపింగ్ చేసినట్లు వివరించారు. మ్యాపింగ్‌ చేసిన ఆర్‌బీకేలకు మిల్లులను అనుసంధానించామని పేర్కొన్నారు. ఖరీఫ్​లో 50 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామని తెలిపారు. తడిసిన, రంగుమారిన ధాన్యం కొనాలని అదేశించామని.. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా అడ్డుకున్నామని కన్నబాబు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details