విజయవాడ గేట్ వే హోటల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ సంఘాల వారితో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమావేశమయ్యారు. అనంతరం డీఈవోలు, ఆర్జేడీలు, పీఓలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. విద్యా వ్యవస్థలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం కోసం నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా అమ్మఒడి పథకం చేరేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యావ్యవస్థలో సంస్కరణలకు అడుగులు పడుతున్నాయని...ఆ దిశగా అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు. విద్యను వ్యాపార దృష్టితో చూస్తూ విద్యార్థులను ఇబ్బంది పెట్టే సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తనకున్న సమయంలో 50 శాతం సమయాన్ని పాఠశాల విద్యకు.. మిగిలిన సమయంలో 30 శాతం కళాశాల విద్య, 20 శాతం ఉన్నత విద్యకు కేటాయించి పని చేస్తున్నానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అధికారులు పూర్తి సహకారం అందించి...ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలి: మంత్రి సురేశ్ - review meeting
విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థితికి చేరేలా పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పు చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులకు సూచించారు.
సమీక్ష సమావేశం