ఉపాధి కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలానికి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కర్నూలు జిల్లా వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పత్తికొండ తాలూకా మదనంతపురం నుంచి పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చామని చెప్పారు. లాక్ డౌన్‌తో పనులు లేక దాదాపు నెల రోజులుగా ఒకపూట తిని మరోపూట పస్తులుంటున్నామని వాపోయారు.
మరోవైపు తమ జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇళ్ల దగ్గర కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో అని ఆందోళన చెందుతున్నామన్నారు. తమను స్వగ్రామాలకు పంపాలని అధికారులను వేడుకున్నారు.