ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కత్తులతో వెంబడించి హత్య... పాత గొడవలే కారణమా!? - jagadigirigutta Murder news

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పరిధి ఆర్పీ కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని నలుగురు వ్యక్తులు వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. హత్యకు పాత గొడవలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

man killed with knife news in jagadigirigutta
జగద్గిరిగుట్టలో కత్తులతో వ్యక్తి హత్య

By

Published : May 11, 2020, 7:42 PM IST

తెలంగాణలోని హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పీఎస్​ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఆర్పీ కాలనీకి చెందిన ఫయాజ్‌ను... కొందరు దుండగులు వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఫయాజ్ యత్నించినప్పటికీ దుండగులు వెంబడించి క్రూరంగా హతమార్చారు.

సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పాత గొడవల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు... వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

జగద్గిరిగుట్టలో కత్తులతో వ్యక్తి హత్య

ఇదీ చూడండి:విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన

ABOUT THE AUTHOR

...view details